ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారు మంగళవారం అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చదురుగుడిలో కొలువైన పోలమాంబను గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో శివలింగానికి మహా రుద్రాభిషేకం చేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అందించారు. కార్యక్రమంలో ట్రస్టు బోర్డు చైర్మన్ నైదాన తిరుపతి, ఆలయ ఈఓ వి.వి.సూర్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. – మక్కువ


