ఐదు దుకాణాల్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఐదు దుకాణాల్లో చోరీ

Oct 14 2026 4:05 AM | Updated on Oct 14 2026 4:05 AM

చీపురుపల్లి: పట్టణంలోని మెయిన్‌రోడ్‌లో వరుసగా ఐదు దుకాణాల్లో జరిగిన చోరీ కలకలం రేపింది. సోమవారం రాత్రి జరిగిన ఈ చోరీ వ్యాపారుల్లో గుబులు రేపింది. పట్టణంలోని లావేరురోడ్‌లో వరుసగా ఐదు దుకాణాల్లో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ చోరీలో కలివరపు విశ్వేశ్వరరావుకు చెందిన కిరాణా దుకాణంలో రూ.50 వేలు నగదు అపహరణకు గురైంది. మిగిలిన నాలుగు దుకాణాల్లో చోరీకి ప్రయత్నించిన దుండగులు ఏమీ లభ్యంకాకపోవడంతో దుకాణాల్లో వస్తువులు చిందరవందర చేసి వెళ్లిపోయారు. దీంతో మంగళవారం ఉదయం బాధితులు చీపురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు చోరీకి గురైన దుకాణాలను పరిశీలించారు.

బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ

ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, గవిడి సురేష్‌లు చోరీ జరిగిన దుకాణాలను పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా కల్పించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ అక్కడి నుంచి పోలీసులతో మాట్లాడి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement