మందుల దుకాణాల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

మందుల దుకాణాల్లో తనిఖీలు

Oct 14 2026 4:05 AM | Updated on Oct 14 2026 4:05 AM

విజయనగరం టౌన్‌: జిల్లాలోని వివిధ మొడికల్‌ షాప్స్‌లో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) విశాఖ జోన్‌ అధికారులు, వన్‌టౌన్‌ పోలీసులు, ఈగల్‌ టీమ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని వెంకటపద్మ మెడికల్స్‌, ధన్వి, మువ్వగోపాల, అపోలో ఫార్మసీ, కస్వీ, తిరుమల మెడికవర్‌ హోల్‌సేల్‌, రిటైల్స్‌ షాపులలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌సీబీ ఇన్‌స్పెపెక్టర్‌ సతీష్‌కుమార్‌, స్టేట్‌ డ్రగ్స్‌ శాఖకు చెందిన లావణ్యలు మాట్లాడుతూ నార్కోటిక్‌ డ్రగ్స్‌, సైకోట్రోఫిక్‌ పదార్థాల అక్రమ నిల్వలు, విక్రయాలు, వాటికి సంబంధించిన రికా ర్డుల నిర్వహణ పరిశీలించామన్నారు. మెడికల్‌ షాపుల నిర్వహకులందరూ ఔషధాల విక్రయాలు, నిల్వలు, రికార్డుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. తనిఖీల సమయంలో సరైన డాక్యుమెంటేషన్‌, రికార్డులు, వైద్యుల ప్రిస్క్రప్షన్‌, లేదా చెల్లుబాటయ్యే లైసెన్స్‌లు లేనట్లు గుర్తిస్తే నిబంధనల ప్రకారం ఆషాపు లైసెన్స్‌ తక్షణమే రద్దుచేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోఫిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టంప్రకారం కఠినచర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈగల్‌ టీమ్‌ ఎస్‌ఐ స్వీటీ, వన్‌టౌన్‌ పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement