పాలకొండ రూరల్: జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు స్థానిక పెద్దకాపు వీధికి చెందిన పొగిరి కిశోర్ ఎంపికయ్యారు. ఈ నెల 9,10,11 తేదీల్లో కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో వివిధ విభాగాల్లో 181 కేజీల మేర బరువు ఎత్తి ప్రథమ స్థానంలో నిలవడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే నెల 30న జరగనున్న జాతీయస్థాయిలో పాల్గొననున్నాడు. ఆయన తల్లిదండ్రులు వెంకటరమణ ఎలక్ట్రీషియన్ కాగా తల్లి జ్యోతి గృహిణి. కిశోర్ గత ఏడాది వీఎల్‌ఎం కేటగిరిలో సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ మేరకు క్రీడాకారుడిని పార్వతీపురం మన్యం జిల్లా కబడ్డీ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పల్లా కొండలరావు తదితరులు పాలకొండలో సోమవారం అభినందించారు. జాతీయ స్థాయిలో సత్తాచాటాలంటూ ప్రోత్సహించారు.
రైతుబజార్‌లో బియ్యం
కౌంటర్‌పునఃప్రారంభం
విజయనగరం ఫోర్ట్: రైతు బజార్లలో బియ్యం కౌంటర్లు ఎత్తేయడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారనే అంశంపై ఈనెల 9న సాక్షిలో బియ్యం కౌంటర్లు ఎత్తేశారు శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు.ఈ మేరకు సోమవారం ఆర్‌అండ్‌బీ రైతు బజార్‌లో మార్కెటింగ్‌శాఖ ఎ.డి రవికిరణ్, సివిల్‌సప్‌లైస్ డీఎం బి. శాంతిలు ధరణి పేరుతో బియ్యం కౌంటర్లను పునఃప్రారంభించారు.
ఐటీఐలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ రేపు
సాలూరు: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో బుధవారం క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ కోట్ల శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. స్కైనిడర్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్, టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ తదితర కంపెనీలు ఈ ప్లేస్‌మెంట్‌కు వస్తాయన్నారు.ఆసక్తిగల అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9573644439 నంబరును సంప్రదించాలని పిలుపునిచ్చారు.
హుండీ ఆదాయం చోరీ
దత్తిరాజేరు: మండల కేంద్రంలోని శివాలయంలో ఉన్న హుండీని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు శివాలయం కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు. భక్తులు హుండీలో వేసిన డబ్బులు అధిక మొత్తంలో ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం తెల్లవారుజామున చోరీకి పాల్పడినట్లు తెలిపారు.ఈ విషయమై పెదమానాపురం పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించినట్లు గ్రామ మాజీ సర్పంచ్ మహదేవ్ ఫణీంద్రుడు తెలిపారు.
బంగారం చోరీకేసులో
నిందితుడి అరెస్టు
బాడంగి: మండలంలోని గజరాయునివలసలో గ్రామంలో జరిగిన బంగారం చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి బొబ్బిలికోర్టుకు తరించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి ఎస్సై సూర్యకుమారి అందించిన వివరాలిలా ఉన్నాయి. గజరాయునివలస గ్రామానికి చెందిన గిరి జాపు సురేష్ ఇంటిలో సోమవారం ఉదయం దొంగతనం జరిగిందని తమకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేసి అదే గ్రామానికి చెందిన పక్కింటి వ్యక్తి దొంగతనం చేసినట్లు రుజువవడంతో నిందితుడి దగ్గర నుంచి ముప్పావుతులం బంగారాన్ని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామని ఎస్సై చెప్పారు.


