నేర నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

నేర నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు : ఎస్పీ

Oct 11 2026 12:51 AM | Updated on Oct 11 2026 12:51 AM

నేర నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు : ఎస్పీ

విజయనగరం టౌన్‌: నేర నియంత్రణకు హైక్వాలిటీ నైట్‌ విజన్‌ సీసీ కెమెరాలను పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఎఆర్‌.దామోదర్‌ తెలిపారు. వన్‌టౌన్‌ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌టీసీ కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు శనివారం వాటిని ప్రారంభించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై, పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్‌టీసీ కాంప్లెక్స్‌కు ప్రతీరోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారన్నారు. జేబు దొంగతనాలు, బ్యాగ్‌ కటింగ్స్‌, చైన్‌ స్నాచింగ్స్‌, ఈవ్‌ టీజింగ్‌, గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు కొత్తగా 12 హైక్వాలిటీ నైట్‌ విజన్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌టీసీ కాంప్లెక్స్‌లో పోలీసుల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు స్ధలం కేటాయించాలని కోరారు. నేర నియంత్రణలో భాగంగా పోలీసుశాఖ చేపడుతున్న చర్యలకు ఆర్‌టీసీ అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం కాంప్లెక్స్‌ పరిసర ప్రాంతాలను సందర్శించి, సీసీ పుటేజ్‌ పనితీరు పర్యవేక్షించారు. కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎస్‌.లక్ష్మణమూర్తి, వన్‌టౌన్‌ సీఐ ఆర్‌విఆర్‌కె.చౌదరి, సీసీఎస్‌ సీఐ డిడి.నాయుడు, ఆర్‌టీసీ డిపో మేనేజర్‌ జె.శ్రీనివాసరావు, ఎస్‌ఐలు సురేంద్రనాయుడు, రవి, ప్రసన్నకుమార్‌, స్టేషన్‌ మేనేజర్‌ సిహెచ్‌.దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement