సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం

Oct 10 2026 12:46 AM | Updated on Oct 10 2026 12:46 AM

● రీజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌

సీతంపేట (విశాఖ): ఫైర్‌ సిబ్బంది సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని రీజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జోనల్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం విశాఖలో జోన్‌–1 ఉత్తరాంధ్ర జిల్లాల స్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని ఎల్‌ స్క్వేర్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సమష్టిగా కృషి చేయడమే జోనల్‌ సమావేశాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ నిరంజన్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు .కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి సత్యనారాయణ, విజయనగరం జిల్లా అగ్నిమాపక అధికారి సాయి రాజేష్‌, పార్వతీపురం మన్యం జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement