మక్కువ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల11వ తేదీ నుంచి 20వరకు శరన్నవరాత్రి మహోత్సవా(దసరా ఉత్సవాలు)లు జరపనున్నట్లు ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు పోలమాంబ అమ్మవారి చదురుగుడిలో శుక్రవారం ఆలయ కమిటీ చైర్మన్ నైదాన చిన్నతిరుపతి, కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల తేదీలను, జరపనున్న పూజలను కరపత్రం ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది మురళీకృష్ణ మూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు.


