పార్వతీపురం రూరల్: అండర్ 14 బాలికల క్రికెట్ ఎంపిక పోటీలలో పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని గొర్లి శ్రీవాణి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికై ంది. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఐ.గౌరి వివరాలను వెల్లడించారు. ఈ ఎంపిక పోటీల కోసం శ్రీవాణికి వ్యాయామ ఉపాధ్యాయుడు సింహాచలం ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. శ్రీవాణి రాష్ట్ర జట్టుకు ఎంపికవడం పట్ల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ రెడ్డి ప్రసాద రావు, కార్యదర్శి సూర్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో చిత్తూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో శ్రీవాణి ఉత్తమ ప్రదర్శన కనబరిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని హెచ్‌ఎం గౌరి కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది శశిధర్ కుమార్, ప్రసాద్, ఉమా, కృష్ణమూర్తి, విజయ్ కుమార్, భాస్కర రావు, భవానీ దేవి, చంద్రకళ, శ్రీనివాసరావు, జనార్దన్, రామలింగ స్వామి పాల్గొని క్రీడాకారిణికి, వ్యాయామ ఉపాధ్యాయునికి శుభాకాంక్షలు తెలియజేశారు.


