మాజీ కౌన్సిలర్‌ ఆకస్మిక మృతి | - | Sakshi
Sakshi News home page

మాజీ కౌన్సిలర్‌ ఆకస్మిక మృతి

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

చికెన్‌

చికెన్‌

● పార్థివదేహానికి నివాళులర్పించిన

మాజీ ఎమ్మెల్యే జోగారావు

పార్వతీపురం రూరల్‌: పురపాలక సంఘం 25వ వార్డు మాజీ కౌన్సిలర్‌, వైఎస్సార్సీపీ సీనియర్‌ నాయకురాలు గండి లక్ష్మి ఆకస్మికంగా గుండెపోటు కారణంగా గురువారం మృతిచెందారు. ఈ మరణవార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆమె నివాసానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు మండల, పట్టణ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement