పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు

● ఫీజు ప్రక్రియతో ప్రభుత్వానికి రూ.9.51 కోట్ల ఆదాయం

● జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి బి.శ్రీనాథుడు

విజయనగరం రూరల్‌: విజయనగరం జిల్లాలో మద్యం దుకాణాల (ఎ–4 షాపుల) కేటాయింపునకు నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియ గురువారం విజయవంతంగా పూర్తయింది. నిబంధనల ప్రకారం కలెక్టర్‌ ఎన్‌.రాంసుందర్‌ రెడ్డి చేతుల మీదుగా జిల్లాలోని 25 మద్యం దుకాణాలకు లాటరీ ప్రక్రియను నిర్వహించారు. జిల్లాలో 169 మద్యం దుకాణాలు ఉండగా 2026 27 ఆర్థిక సంవత్సరానికి రెన్యువల్‌ చేసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా గడువు ముగిసే నాటికి 139 మద్యం దుకాణాలు రెన్యువల్‌ అయ్యాయి. మిగిలిన 30 దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేయగా ఈనెల 6న గడువు ముగిసేనాటికి 25 మద్యం దుకాణాలకు 138 దరఖాస్తులు వచ్చాయి. ఈ 25 మద్యం దుకాణాల నిర్వహణకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం లాటరీ ప్రక్రియ నిర్వహించినట్లు డీఈఈవో శ్రీనాథుడు తెలిపారు. మద్యం దుకాణాల రెన్యువల్‌, 25 ఎ–4 మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్‌న్స్‌ ఫీజు, పర్మిట్‌ రూమ్‌ ఫీజు ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.9.51 కోట్ల ఆదాయం సమాకూరిందని ఆయన వెల్లడించారు. ఇంకా మిగిలిపోయిన ఐదు మద్యం దుకాణాలకు కేటాయింపులకు కొద్ది రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌ చౌదరి, ఎకై ్సజ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లావ్యాప్తంగా రూ.52.88 కోట్ల వార్షిక ఆదాయం అంచనా

పార్వతీపురం రూరల్‌: పార్వతీపురం మన్యం జిల్లాలో 2026–27 లైసెన్స్‌ సంవత్సరానికి గాను నోటిఫై చేసిన 9 ఎ–4 ఓపెన్‌ కేటగిరీ మద్యం దుకాణాలకు 8.10.2026న కలెక్టరేట్‌లోని సువర్ణముఖి సమావేశ మందిరంలో లాటరీ నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి పర్యవేక్షణలో లాటరీ ద్వారా 9 దుకాణాలకు దరఖాస్తుదారుల ఎంపిక జరిగింది. పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం ప్రాంతాల్లోని దుకాణాలకు కేటాయింపులు పూర్తయ్యాయి. ఈ 9 దుకాణాలకు గాను 45 దరఖాస్తులు రాగా, తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుము ద్వారా ప్రభుత్వానికి రూ.1,35,00,000 ఆదాయం సమకూరింది. జిల్లాలో 52 ఓపెన్‌ కేటగిరీ, 4 గీత కులాల దుకాణాలు కలుపుకుని మొత్తం 56 దుకాణాలు ఉన్నాయి. వాటిలో 47 దుకాణాలు ఇప్పటికే రెన్యువల్‌ అయ్యాయి. మొత్తం 56 దుకాణాలకు సంబంధించి వార్షిక రిటైల్‌ ఎకై ్సజ్‌ పన్ను (ఆర్‌ఇటి), పర్మిట్‌ రూమ్‌ ఆర్‌ఈటీ, రెన్యువల్‌ ఆర్‌ఈటీ, దరఖాస్తు రుసుము అన్నీ కలిపి 2026–27 సంవత్సరానికి గాను మొత్తం రూ.52,88,70,000 వార్షిక ఆదాయం సమకూరనుంది. ప్రస్తుతం 47 దుకాణాల రెన్యువల్‌, అన్ని దుకాణాల తొలి వాయిదాలు, దరఖాస్తు రుసుములతో కలుపుకుని మొత్తం రూ.23,16,92,500 ఆదాయం ప్రభుత్వానికి చేరిందని జిల్లా ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ అధికారి పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement