పార్వతీపురం రూరల్:
మాదకద్రవ్యాల రవాణా, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే చర్యల్లో భాగంగా పోలీసులు గురువారం రాయపూర్–విశాఖపట్నం పాసింజర్ రైలు (58527)లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పార్వతీపురం నుంచి బొబ్బిలి రైల్వే స్టేషన్ వరకు ఈ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా సీసీఎస్, ఈగల్ టీం, కొమరాడ పోలీస్, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బందితో పాటు డాగ్ స్క్వాడ్ బృందాలు సంయుక్తంగా రైలులోని అన్ని బోగీలు, ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాయి.
ఈ సోదాల్లో ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణా లేదా అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112 లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు తెలపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్సైలు జగదీశ్ నాయుడు, భాస్కరరావు, అప్పారావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ట్రైన్‌లో ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేస్తున్న పోలీసులు


