రాజాం: మండలంలోని కంచరాం జెడ్‌పీహైస్కూల్ పీడీ తాలాడ దుర్గారావు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీలకు కోచ్‌గా ఎంపికయ్యారు. ఈనెల 10 నుంచి 12 వరకూ పల్నాడు జిల్లా కారంపూడిలో జరుగనున్న పోటీలకు ఈయన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెజ్లింగ్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నారని స్కూల్ గేమ్స్ కమిటీ గురువారం తెలిపింది. ఈ మేరకు ఆయన రెజ్లింగ్ టీమ్‌తో కోచ్‌గా పోటీలకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన్ని పాఠశాల హెచ్‌ఎం వై.గౌరునాయుడు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్‌మోహన్, ఉపాధ్యాయులు లంక శ్రీనివాసరావు, పి.వేణుగోపాలరావు, వై.భాస్కరరావు, బి.మహేష్, గౌరీశంకరరావు, టి.అనూరాధ, అరుణ, వల్లూరి ముత్యాలమ్మ తదితరులు అభినందించారు.
జర్నలిస్టు అవార్డులకు
దరఖాస్తు గడువు పెంపు
పార్వతీపురం: ఉత్తమ జర్నలిస్టుల అవార్డులకు దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబర్ 15వరకు పొడిగించినట్లు సమాచార పౌరసంబంధాలశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు పది విభాగాల్లో మొత్తం 12 అవార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అవార్డుల నగదు పారితోషికం రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులతోపాటు 2025లో ప్రచురితమైన, ప్రసారమైన కనీసం ఐదు వార్తా కథనాలు, వ్యాసాలు, ఫొటోలు సంబంధిత ఆధారాలను జతచేయాలి. దరఖాస్తులను డైరెక్టర్, సమాచార పౌరసంబంధాల శాఖ, రెండవ అంతస్తు, ఎన్‌టీఆర్ పరిపాలన భవనం, పండిట్ నెహ్రూ బస్టేషన్ విజయవాడ చిరునామాకు నేరుగా లేదా పోస్టు ద్వారా పంపించాలని సూచించారు.


