విజయనగరం రూరల్: సైనికుల పునరావాసానికి నైపుణ్య శిక్షణ ఎంతో కీలకమని సీటీయూ ఉపకులపతి టి.శ్రీనివాసన్ అన్నారు. ఈ మేరకు కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూ) ఆధ్వర్యంలో పుణే సైనిక పునరావాస సంచాలక కార్యాలయం సహకారంతో జాబ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెటిల్మెంట్ కార్యక్రమంలో భాగంగా ‘సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ ట్రావెల్ కన్సల్టెన్సీ కోర్సు’ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉపకులపతి టి.శ్రీనివాసన్ మాట్లాడుతూ విద్యను ఉపాధి అవకాశాలతో అనుసంధానించడంలో ఇటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఉద్యోగ రంగంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంతో శిక్షణార్థులు మెరుగైన ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. శిక్షణలో పొందే జ్ఞానం, అనుభవాన్ని సద్వినియోగం చేసుకుని తమ వృత్తిపరమైన సామర్థ్యాలను మరింత పెంపొందించుకోవాలని, భవిష్యత్‌లో ఆత్మవిశ్వాసంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని శిక్షణార్థులకు సూచించారు.
పర్యాటక రంగంలో అవకాశాలు
రిజిస్ట్రార్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ, సైనిక సేవల అనంతరం పునరావాసం పొందే వారికి నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలి పారు. ప్రయాణం, పర్యాటక రంగాల్లో పెరుగుతు న్న అవకాశాల నేపథ్యంలో ఈ కోర్సు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. కన్సల్టెంట్ డాక్టర్ ఉజ్వల్ కుమార్ ఘటక్ మాట్లాడుతూ, సైనిక సేవల అనంతరం కొత్త వృత్తి జీవితాన్ని ప్రారంభించేందుకు నైపుణ్య శిక్షణ ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సైనిక పునరావాస సంచాలక కార్యాలయం ప్రతినిధి డీజీఆర్ (సౌత్) లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ భారత సైన్యం, భార త నౌకాదళం, భారత వైమానిక దళంలో సేవానంతరం పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి అవకా శాలు కల్పించడంలో తమ కార్యాలయం కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. నైపుణ్య శిక్షణ ద్వారా మాజీ సైనికులు కొత్త వృత్తుల్లో స్థిరపడేందుకు, స్వయం ఉపాధి పొందేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో సీటీయూ ఏవో ఎన్‌వీఎస్ సూర్యనారా యణ, ఆర్మీ, నేవీకి చెందిన 45 మంది సైనిక శిక్షణార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీటీయూ ఉపకులపతి టి.శ్రీనివాసన్


