నాలుగేళ్లకే నిండిన నూరేళ్లు | - | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లకే నిండిన నూరేళ్లు

Oct 8 2026 1:24 AM | Updated on Oct 8 2026 1:24 AM

నాలుగేళ్లకే నిండిన నూరేళ్లు

● గెడ్డలో పడి బాలుడి మృతి

● భోరున విలపిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు

పూసపాటిరేగ: భోగాపురం మండలంలోని ముక్కాం గ్రామంలో బుధవారం గెడ్డలో పడి నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం విశాఖపట్నంలో నివాసముంటున్న బడే గుర్రమ్మ తన నాలుగేళ్ల కుమారుడు వెంకీతో కలిసి ఐదు రోజుల క్రితం తమ సొంత గ్రామమైన ముక్కాంలో ఉన్న అక్క కారి అప్పయ్యమ్మ ఇంటికి వచ్చి కుమారుడిన వదిలి విశాఖ వెళ్లింది. బుధవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో బాలుడు వెంకీ కనిపించడం లేదని గుర్రమ్మకు అక్క అప్పయ్యమ్మ ఫోన్‌ చేసి తెలపడంతో గుర్రమ్మ వెంటనే విశాఖ నుంచి గ్రామానికి చేరుకుంది. బాలుడి కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా, సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో గ్రామానికి ఆనుకుని ఉన్న పక్క గెడ్డలో బాలుడు శవమై తేలియాడడం గుర్తించారు. ఆటలాడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోవడం వల్లే బాలుడు మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. తల్లి గుర్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement