నేడు రైతులతో సుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం చర్చలు | - | Sakshi
Sakshi News home page

నేడు రైతులతో సుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం చర్చలు

Oct 8 2026 1:24 AM | Updated on Oct 8 2026 1:24 AM

నేడు రైతులతో సుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం చర్చలు

రేగిడి: మండల పరిధిలోని సంకిలి చక్కెర కర్మాగారంలో క్రషింగ్‌ నిలిపివేస్తామని యాజమాన్యం ప్రకటించడంతో చెరకు రైతులంతా సంఘటితంగా ఏర్పడి ఉద్యమం లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ చెరకు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల రైతులంతా రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. దీనికి స్పందించిన చక్కెర కర్మాగార యాజమాన్యం ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు చెరకు రైతులతో చర్చలకు ఆహ్వానించినట్లు చెరకురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం సంకిలి వద్ద చెరకు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరకు రైతుల పరిరక్షణ సమితి ఏర్పాటుతో యాజమాన్యం చర్చలకు పిలవడం శుభపరిణామమన్నారు. స్థానిక చక్కెర పరిశ్రమను నిలబెట్టుకునేందుకు రైతులంతా ఏకతాటిపై ఉన్నారన్నారు. ఎప్పటిలాగే యాజమాన్యం చెరకు పండించిన రైతులకు రాయితీలు తదితర వాటిని అందజేస్తే భవిష్యత్తులో అధికంగా చెరకు పంట వేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో కిమిడి సూరపునాయుడు, కింజరాపు సురేష్‌, నిష్టల సూర్యప్రకాష్‌ గుప్త, చింత సంగంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement