తోటపల్లిలో ఘనంగా వరుణయాగం, వరుణ జపం | - | Sakshi
Sakshi News home page

తోటపల్లిలో ఘనంగా వరుణయాగం, వరుణ జపం

Oct 7 2026 1:28 AM | Updated on Oct 7 2026 1:28 AM

గరుగుబిల్లి: ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజల సంక్షేమం, శ్రేయస్సుకోసం తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ కోదండరామస్వామి ఆలయాల్లో మంగళవారం వరుణ యాగం, వరుణ జపం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వీవీ అప్పలాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం 6.54గంటలకు పూజ, హోమం కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే టి. జగదీశ్వరి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ జిల్లా అధికారి ఎస్‌.రాజారావు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ ఎం.పకీరునాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement