సరిచేయక తిప్పలు! | - | Sakshi
Sakshi News home page

సరిచేయక తిప్పలు!

Oct 6 2026 12:54 AM | Updated on Oct 6 2026 12:54 AM

ఆధార్‌లో తప్పుల తడకలు.. సరిచేయక తిప్పలు! తప్పులు సరిదిద్దేది ఎలా? ● పీజీఆర్‌ఎస్‌కు వెల్లువెత్తుతున్న వినతులు

ఆధార్‌లో తప్పుల తడకలు..

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌ :

ఆధార్‌లో తప్పుల వల్ల చదువు మధ్యలోనే ఆగిపోయిందని ఒకరు.. పింఛన్‌ అందక జీవనం దుర్భరంగా మారిందని ఇంకొకరు.. ఉద్యోగ నియామకా ల్లో తనకు అన్యాయం చేశారని మరొకరు.. ఇలా వివిధ సమస్యలపై సోమవారం కలెక్టరేట్‌లో జరిగి న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులు తరలివచ్చారు. సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

సాలూరు మండలం కొత్తవలస పంచాయతీ జి.కర కవలసకు చెందిన పలువురు విద్యార్థులు పి.కోనవలస గిరిజన సంక్షేమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరి ఆధార్‌ కార్డులో తప్పులు ఉన్నాయన్న కారణంతో, మార్పుచేసి తీసుకురావా లని ఉపాధ్యాయులు ఇళ్లకు పంపేశారు. లేదంటే పదో తరగతి పరీక్షలు రాయించలేమని అంటున్నా రు. పుట్టిన ధ్రువపత్రం కోసం ఆధార్‌ సెంటర్లు, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా.. ఫలితం ఉండడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. గెజిటెడ్‌ అధికారితో జారీ చేసిన పత్రం అడుగుతున్నారని.. ఎవరిని అడిగినా చేయడం లేదని అడ్డాకుల గంగమ్మ, మంగమ్మ తదితరులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి కురుపాం మండలంలో కూడా పలువురు ఎదుర్కొంటున్నారు. గదబకరకవలసకు చెందిన విద్యార్థి కొర్ర గణేష్‌కు ఆధార్‌లో అడ్డాకుల హేమంత్‌గా పడింది. పేరు మార్చేందుకు ఎన్ని చోట్ల తిరిగి నా ఫలితం ఉండడం లేదని.. దీనివల్ల తన చదువు కూడా ఆగిపోయిందని గణేష్‌ చెబుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement