ఐటీడీఏలో డీడీ పోస్టు ఖాళీ | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏలో డీడీ పోస్టు ఖాళీ

Oct 6 2026 12:54 AM | Updated on Oct 6 2026 12:54 AM

ఐటీడీఏలో డీడీ పోస్టు ఖాళీ ● ఎఫ్‌ఏసీతో గిరిజన విద్యకు ఇబ్బందులా? ● రెగ్యులర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ను నియమించాలని ఆదివాసీ సంఘాల డిమాండ్‌

● ఎఫ్‌ఏసీతో గిరిజన విద్యకు ఇబ్బందులా? ● రెగ్యులర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ను నియమించాలని ఆదివాసీ సంఘాల డిమాండ్‌

సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ఐటీడీఏలో కీలకమైన డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉండంపై ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పోస్టులో ఏపీవో మురళీధర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించడం వల్ల గిరిజన విద్యాశాఖ పరిపాలనపై ప్రతికూల ప్రభా వం పడుతోందని వారు చెబుతున్నారు. గిరిజన విద్యార్థులకు సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ హాస్టళ్లు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, వివిధ విద్యా పథకాల అమలు తదితర అంశాల్లో డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టు కీలకం. ఇలాంటి ప్రాధాన్యమైన పోస్టును ఖాళీగా ఉంచి, ఇప్పటికే ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్న ఏపీవోకు ఎఫ్‌ఏసీ ఇవ్వడం వల్ల విద్యాశాఖపై పూర్తి స్థాయి పర్యవేక్షణ కష్టమవుతుంది.

విద్యార్థుల సమస్యలు పెండింగ్‌లో..

ఏపీవోకు ఇప్పటికే వారి సొంత శాఖకు సంబంధించిన విధులు, బాధ్యతలు ఉన్నాయి. అదనంగా విద్యాశాఖ బాధ్యతలు అప్పగించడం వల్ల పనిభా రం పెరుగుతుందని ఆదివాసీ సంఘాలు అంటున్నాయి. ఫలితంగా గిరిజన విద్యార్థులకు సంబంధించిన సమస్యలు, పాఠశాలలు–హాస్టళ్ల నిర్వహణ, విద్యా పథకాల అమలు వంటి అంశాలు పెండింగ్‌లో ఉండే అవకాశం ఉందన్నది వారి వాదన. డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టును ప్రభుత్వం వెంటనే రెగ్యులర్‌ అధికారితో భర్తీ చేయాలని.. తక్షణ నియామకం సాధ్యం కాకపోతే ఐటీడీఏలో అనుభ వం ఉన్న సీనియర్‌ ఏటీడబ్ల్యూవోకు సీనియారిటీ ప్రాతిపదికన బాధ్యతలు అప్పగించాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి. ఐటీడీఏలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎఫ్‌ఏసీ విధానంపై గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ తక్షణమే స్పందించాలని.. ప్రభుత్వం స్పందించకపోతే కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement