●న్యాయం చేయండి... | - | Sakshi
Sakshi News home page

●న్యాయం చేయండి...

Oct 6 2026 12:54 AM | Updated on Oct 6 2026 12:54 AM

●న్యాయం చేయండి...

కొమరాడ మండలం చోళ్లపథం పంచాయతీ ఇంద్రా నగరం గ్రామానికి చెందిన పాడి సువర్ణ ఇటీవల అంగన్వాడీ సహాయకురా లి పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వయసు తక్కువున్నా.. మెరిట్‌ ప్రకారం ముందు వరుసలో ఉన్నా.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనకు కాదని.. మరొకరికి పోస్టు ఇచ్చారని ఆమె వాపోయింది. వారికి రాజకీయ సిఫారసు ఉండటం వల్ల తనకు అన్యాయం చేశారని వాపోయింది.

●2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫొటో, వీడియోగ్రాఫర్లుగా సేవలందించామని.. పని చేసిన కాలానికి ఇంకా బకాయి మొత్తం ఉందని పాలకొండ నియోజకవర్గానికి చెందిన కె.అన్నాజీరావు తదితరులు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ముగిసి, రెండున్నరేళ్లు అవుతున్నా ఇంకా బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement