ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 53 వినతులు | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 53 వినతులు

Oct 6 2026 12:54 AM | Updated on Oct 6 2026 12:54 AM

సీతంపేట: ప్రతి సోమవారం ఐటీడీఏలో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు అధికారులు గైర్హాజరైతే సహించేది లేదని పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ పవార్‌స్వప్నిల్‌ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులంతా పీజీఆర్‌ఎస్‌కు హాజరు కావాలన్నారు. ఈ సందర్భంగా 53 వినతులను స్వీకరించారు. ఈతమానుగూడ, పోలిష్‌కోటకు చెందిన ఆరిక తురకన్న, రాజేష్‌, సురేష్‌ తదితరులు తమ పిల్లలకు తల్లికి వందనం డబ్బులు రాలేదని విన్నవించారు. చెత్తసేకరణ సిబ్బంది గత 8 నెలలుగా విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని జన్ని సంజీవరావు ఫిర్యాదు చేశాడు. బంజీరుపేలో వాటర్‌ ట్యాంక్‌ ఎత్తు పెంచాలని ఎ.పుష్పలత వినతి ఇచ్చారు. జన్నోడుగూడ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని తురకన్న కోరాడు. కార్యక్రమంలో ఏపీవో జి.చిన్నబాబు, ఏపీడీ ఎం.వి.రమణ, వ్యవసాయాధికారి వాహిని, డీఈ నాగభూషణరావు, పీఆర్‌ ఏఈ కిరణ్‌కుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ సత్యం, ఎంఈఓ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement