ప్రచారం డప్పు! | - | Sakshi
Sakshi News home page

ప్రచారం డప్పు!

Sep 27 2026 1:16 AM | Updated on Sep 27 2026 1:16 AM

ప్రచారం డప్పు! ఆడబిడ్డ నిధి ఏదీ.. నిరుద్యోగ భృతి ఎక్కడ?

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌: రాత్రీ పగలు శ్రమించి.. రూ.లక్షలు ఖర్చు చేసి ఉన్నత చదువులు చదివారా... డిగ్రీల మీద డిగ్రీలు సాధించారా.. అబ్బే వాటితో ఏం లాభం లేదు!. చదువు లేకపోయినా.. డిగ్రీలు సాధించకపోయినా ఇబ్బందేమీ లేదు.. కాస్త సోషల్‌ మీడియా మీద అవగాహన ఉండి.. ప్రభుత్వ పనితీరు మెచ్చే వీడియోలు చేయడం వస్తే చాలు..! మీకు ఉద్యోగం దొరికేసినట్టే!! చంద్రబాబు ప్రభుత్వమే పిలిచి మరీ ‘ఉద్యోగం’ ఇస్తుంది. మీరు చేయాల్సిందంతా కేవలం.. ‘లేనిది ఉన్నట్టు.. అంతా కనికట్టు’ కింద ప్రభుత్వ పరిపాలనపై అదిరిపోయే రేంజ్‌లో రీల్స్‌ రూపంలో ఎలివేషన్‌ ఇవ్వడమే!. దీనికోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, యూట్యూబ్‌, ఎక్స్‌ (ట్విట్టర్‌) వంటి సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను గుర్తించి వారి చేత ప్రభుత్వ పనులు ప్రచారం చేయించడానికి రూ.కోట్ల ఖర్చుకు సన్నాహాలు చేస్తోంది. డిజిటల్‌ ప్రచారం, ప్రజా సమాచారాన్ని బలోపేతం చేయడానికి సోషల్‌ మీడియా కంటెంట్‌ క్రియేటర్లతో సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ ముసాయిదాను రూపొందించనున్నట్లు ఇటీవల మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. దీనిపై నిరుద్యోగ యువత భగ్గుమంటోంది. ప్రచారం కోసం ప్రజాధనం ఖర్చుచేయడం, చదువుకున్న నిరుద్యోగులను పట్టించుకోకపోవడంపై మండిపడుతోంది.

తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య తీరుస్తామని గత ఎన్నికలకు ముందు చంద్రబాబు అండ్‌ కో చెప్పారు. క్రమం తప్పకుండా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తూ.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టారు. ఉద్యోగం ఇవ్వని పక్షంలో ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. జిల్లాలో 1.20 లక్షల మంది వరకూ నిరుద్యోగులు ఉంటారని అంచనా.. ఇందులో వేలాది మంది రూ.వేలల్లో ఖర్చు పెట్టి ఉద్యోగ శిక్షణలు పొందుతున్నారు. ప్రభుత్వం నుంచి ఈ రెండేళ్లలో ఉద్యోగ ప్రకటనలు లేవు. మెగా డీఎస్సీ అంటూ పోస్టులు తీసినా.. పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. అనర్హులు పోస్టులు దక్కించున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇంక పలు ఉద్యోగ ప్రకటనలు... ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. నిరుద్యోగ భృతి కింద ఏటా ఒకొక్కరికీ ఏడాదికి రూ.36 వేలు చొప్పున ప్రభుత్వం బాకీ పడింది.

● ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని.. ఇద్దరు ఉంటే రూ.3 వేలు ఇస్తామని మాట ఇచ్చారు. ఆడబిడ్డ నిధి కోసం జిల్లాలో వేలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక్కరికీ ఇచ్చిన దాఖలాలు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement