ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి అందిస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, పరిశ్రమలు తీసుకొస్తామని బూటకపు హామీలు ఇచ్చారు. తీరా పీఠమెక్కాక ఆ హామీలన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసి, నిరుద్యోగులను రోడ్డున పడేసింది. ప్రజల కష్టార్జితమైన సొమ్ముతో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి ఇన్‌ఫ్లూయెన్సర్లను కుదుర్చుకోవడం విడ్డూరంగా ఉంది. ప్రచారాల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగానికి క్యాబినెట్‌లో విచిత్రమైన పాలసీకి ఆమోదం తెలపడం దారుణం. ఇది స్పష్టంగా వారి సొంత ఐ–టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియా టీమ్‌లకు లబ్ధి చేకూర్చేందుకే వేసిన పెద్ద కుట్ర. నిరుద్యోగుల పొట్టకొట్టి, ప్రభుత్వ భజన చేసే వాళ్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టడం ఏ రకమైన న్యాయం? – వినోద్ కుమార్, నర్సిపురం, పార్వతీపురం


