బీటెక్ వంటి ఉన్నత చదువులు చదువుకున్న వారికి ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్నారు. ఇస్తామన్న నిరుద్యోగ భృతిని రెండున్నరేళ్లుగా ఎగ్గొడుతున్నారు. ప్రచార యావతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు నెలకు రూ.25 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ప్రజాధనాన్ని దోచిపెట్టడం ఎంతవరకు న్యాయం?. ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతోనే, మీ భజన చేయడానికి, మీ అనుకూల వర్గాలకు లబ్ధి చేకూర్చడానికి ఈ విచిత్ర పాలసీ తీసుకువచ్చారా? 50 ఏళ్లకే పింఛన్, ఆడబిడ్డ నిధి లాంటి బూటకపు హామీలతో పీఠమెక్కి, ఇప్పుడు ఎంతో కష్టపడి చదువుకున్న నిరుద్యోగులను నట్టేట ముంచారు. మీ విధానాలను ప్రజలతో పాటు మేధావి వర్గం గమనిస్తోంది.
– పోల సత్యనారాయణ, పార్వతీపురం


