వరద బాధితులను ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

వరద బాధితులను ఆదుకోండి

Sep 27 2026 1:16 AM | Updated on Sep 27 2026 1:16 AM

● ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌

పాలకొండ రూరల్‌: తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ డిమాండ్‌ చేశారు. తాజా వర్షాలతో మండలంలోని వరదముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన అన్నవరం గ్రామాన్ని పార్టీ శ్రేణులతో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాగావళి నదీ తీరానికి ఆనుకుని ఉన్న గ్రామంలోకి భారీగా వరద నీరు చేరడంతో పంటలు, ప్రజల ఆస్తులు, దైనందిన జీవనానికి ఇబ్బందులు తలెత్తినట్లు గ్రామ మాజీ సర్పంచ్‌ గవర రాజశేఖర్‌, దుర్గారావు తదితరులు తెలిపారు. ఇళ్లలోకి నీరు చేరడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినట్లు వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. అధికారులు తక్షణ వసతులు కల్పించాలని, ఆహారం, రక్షిత నీరు అందించాలన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. క్షేత్రస్థాయిలో నష్టాలను అంచనా వేసి అధికారులు పరిహారం అందించాలన్నారు. ఆయన వెంట మాజీ వైస్‌ ఎంపీపీ ఎం.సూర్యప్రకాష్‌, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు వెలమల మన్మథరావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సీహెచ్‌ సంఘంనాయుడు, మాజీ సర్పంచ్‌ లోలుగు విశ్వేశ్వరరావు, మాజీ కౌన్సిలర్‌ కిల్లారి మెహనరావు, గవర ప్రవీణ్‌కుమార్‌, బత్తిన రమణ, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement