గుమ్మలక్ష్మీపురం: భద్రగిరి సీహెచ్‌సీ కొత్తభవనాలు నాలుగైదు రోజుల్లో అందుబాటులోకి వస్తాయని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నాగభూషణరావు తెలిపారు. ఈనెల 27న ‘సెల్‌ఫోన్ వెలుగులో బాలుడికి వైద్యం’ 28న ‘అరకొర బెడ్‌లు..రోగులకు తప్పని వెతలు’ శీర్షికన ప్రచురితమైన వార్తలకు డీసీహెచ్‌ఎస్‌తో పాటు ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ భారతి స్పందిచారు. శుక్రవారం భద్రగిరి సీహెచ్‌సీని పరిశీలించారు. పాత, కొత్త భవనాల్లో రోగులకు అందుతున్న, అందించాల్సిన వైద్య సేవలు, కల్పించాల్సిన సదుపాయాలపై ఆరా తీశారు.
డ్రైనేజీ, నీటి సౌకర్యం, జనరేటర్ వంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, నాలుగైదు రోజుల్లో పనులు పూర్తిచేసి, నూతన భవనాల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.


