–8లో
హిట్ రన్ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించాలి
హిట్ రన్ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు.
గుమ్మలక్ష్మీపురం: కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన 50 పడకల భద్రగిరి సీహెచ్‌సీలో సెల్‌ఫోన్ వెలుగుల్లో గిరిజనులకు వైద్య సేవలందిస్తుండం అత్యంత దురదృష్టకరమని, గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి గిరిజనుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ సంఘటనే తెలియజేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఆమె భద్రగిరి సీహెచ్‌సీని శుక్రవారం పరిశీలించారు. నూతనంగా ప్రారంభించిన భవనాల్లో చేపడుతున్న ప్లంబింగ్, వైరింగ్ తదితర పనులతో పాటు, పాత భవనంలో ఇన్‌పేషెంట్లకు సరిపడినన్ని బెడ్లు, ఫ్యాన్లు లేక పడుతున్న అవస్థలను పరిశీలించారు. అనంతరం ఆమె మీడి యాతో మాట్లాడారు. రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించిన సీహెచ్‌సీ నూతన భవనాల్లో జనరేటర్, ఆక్సిజన్, మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్ వంటి కనీస సౌకర్యాలను కల్పించకుండానే ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఈ నెల 8న ఆస్పత్రి భవనాన్ని ప్రారంభిస్తూ గిరిజనులకు అంకితమిస్తున్నట్లు చెప్పడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో మంజూరైన ఒకే ఒక్క గిరిజన ఇంజినీ రింగ్ కళాశాలను కురుపాం నియోజకవర్గానికి తీసుకొచ్చామని, కురుపాం నియోకవర్గ కేంద్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో రూ.6వేల కోట్లు అమ్మఒడి నగదును విడుదల చేసే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించి కురుపాం పేరును రాష్ట్రంతో పాటు దేశ ప్రజలంతా గొప్పగా చెప్పుకొనే స్థాయికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సెల్‌ఫోన్ వెలుగుల్లో వైద్య సేవలందిస్తున్న దుస్థితికి దిగజార్చి కురుపాం నియోజవర్గం పరువును తీస్తున్నారని విమర్శించారు. నూతన భవనం ప్రారంభించి 20 రోజులు దాటుతున్నా ఇన్‌పేషెంట్లకు పాత భవనాల్లోనే సేవలందించడం, మీడియాలో వార్తలు రావడంతో పనులు చేయిస్తుండడం విచారకరమన్నారు.
● 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం హయాంలో భద్రగిరి సీహెచ్‌సీలో ఒక్క వైద్యుడే సేవలందించేవారని, వైద్యులను, సిబ్బందిని నియమించాలని అసెంబ్లీ వేదికగా ఎన్నో మార్లు ప్రశ్నించిన్నా చంద్రబాబు పట్టించుకోలేదని పుష్పశ్రీవాణి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాకే 8 మంది వైద్యులను సీహెచ్‌సీలో నియమించడంతో పాటు నైట్‌వాచ్‌మన్ వరకూ అన్ని రకాల వైద్య సిబ్బందిని నియమించామన్నారు. 20 ఏళ్లకు పైబడి నిలిచిపోయిన పోస్టుమార్టం కేంద్రాన్ని కూడా గిరిజనుల కోసం నూతన భవనాన్ని నిర్మించి పునఃప్రారంభించినట్లు చెప్పారు. 30 పడకల ఆస్పత్రిని 50 పడకలకు మార్చుతూ రూ.9 కోట్లు నిధులు మంజూరు చేయించి ప్లానింగ్ డిజైన్ మొదలుకొని సుమారు 60 శాతం నిర్మాణ పనులు కూడా తమ ప్రభుత్వంలోనే చేసినట్టు వెల్లడించారు.
పేర్లు మార్చేందుకే పరిమితం..
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కురుపాం ఎమ్మెల్యే ఇద్దరూ గిరిజనులే అయినప్పటికీ.. శిలాఫలకాల్లో పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో లేదని పుష్పశ్రీవాణి విమర్శించారు. గిరిజన విద్యార్థి జీవన్‌కుమార్ మృతిచెందగా పరిహారం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చినా నేటికీ అందజేయకపోవడం విచారకరమన్నారు. తక్షణమే భద్రగిరి సీహెచ్‌సీ నూతన భవనాల్లో సౌకర్యాలు కల్పించి, గిరిజనులకు మెరుగైన వైద్యసవల్ని అందించాలని, లేకుంటే గిరిజనుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆమె వెంట ఎంపీపీ కుంబురు దీనమయ్య, జెడ్పీటీసీ మండంగి రాధిక, వైస్ ఎంపీపీలు నిమ్మక రాజశేఖర్, లక్ష్మణరావు, నాయకులు గోరిశెట్టి గిరిబాబు, బి.గౌరీశంకరరావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులకు వైద్యకష్టాలు ఎదురవుతున్నా పట్టించుకోని నేతలు
కనీస వసతులు కల్పించకుండానే భద్రగిరి ఆస్పత్రి నూతన భవనం ప్రారంభం
సెల్‌ఫోన్ వెలుగుల్లో వైద్యసేవలు దురదృష్టకరం
కురుపాం నియోజకవర్గ పరువు తీస్తున్నారు
భద్రగిరి సీహెచ్‌సీని పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి


