నెల్లిమర్ల రూరల్: మండలంలోని వల్లూరు గ్రామంలో సోమవారం జరిగిన సిరుగుడి రామారావు(60) హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మంగళవారం చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పరిస్థితులపై ఆరా తీశారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. గ్రామంలోని ఎలాంటి గొడవలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. వివాదాలకు కారణమయ్యే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన వెంట భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఎస్‌ఐ గోపాలరావు ఉన్నారు.


