విజయనగరం: విజయనగరం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ పరిధిలో అథ్లెటిక్స్ విభాగంలో శిక్షణ ఇచ్చేందుకు నూతనంగా కోచ్‌ను నియమిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నెయిగాపుల శ్రీనివాసరావును నియమిస్తున్నట్టు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరిలో అథ్లెటిక్స్ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు విజయనగరం అథ్లెటిక్స్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీనివాసరావు స్వస్థలం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అయ్యన్నపేట ప్రాంతం. అథ్లెటిక్స్ కోచ్‌గా శ్రీనివాసరావు నియామకం పట్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు


