విజయనగరం టౌన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన వన్‌టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సోమవారం స్థానిక వన్‌టౌన్ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ధర్మపురి గ్రామానికి చెందిన కొయ్యాన దిలీప్ (19) ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. పట్టణంలోని పీజీ స్టార్ హాస్పిటల్ వద్ద బైక్ అదుపు తప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై మృతి చెందాడు. మృతుని సోదరుడు కొయ్యాన జానకీరామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


