మా పూర్వీకులకు బతుకుదెరువు కోసం ప్రభుత్వం ఇచ్చిన సీలింగ్ భూమిని టీడీపీ నేతలు దౌర్జన్యంగా లాక్కున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా, ఆర్డీఓ కోర్టులో కేసు నడుస్తున్నా ఖాతరు చేయకుండా రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతున్నారు. ఫిర్యాదులు చేసినా అధికారులు అధికార పార్టీ నేతలకే కొమ్ముకాస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేసి, మా భూములు మాకు అప్పగించి న్యాయం చేయాలి.
– బెల్లాన మధుసూదనరావు,
బాధితుడు, గాజులరేగ


