బుద్ధ, కల్కి అవతారాల్లో జగన్నాథుడు | - | Sakshi
Sakshi News home page

బుద్ధ, కల్కి అవతారాల్లో జగన్నాథుడు

Jul 24 2026 1:15 AM | Updated on Jul 24 2026 1:15 AM

బుద్ధ, కల్కి అవతారాల్లో జగన్నాథుడు నేడు మారు రథయాత్ర ప్రభుత్వ సూచీల్లో ఎ+గ్రేడ్‌ లక్ష్యం ● కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి

బలిజిపేట: జగన్నాథస్వామి ఉత్సవాల్లో భాగంగా 8వరోజు గురువారం స్వామివారిని బుద్ధ, కల్కి అవతారాల్లో అలంకరించారు. అర్చకులు గుండిచా మందిరం వద్ద స్వామివారికి అవతా రాలను మార్పుచేసి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలతో స్వామివా రికి పూజలు చేసిన అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామిని దర్శించుకున్నారు.

వీరఘట్టం: ఈనెల 16వ తేదీ నుంచి వీరఘట్టం మండల కేంద్రంలో జరుగుతున్న జగన్నాథ స్వామి రథమహోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. శుక్రవారంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. చివరిరోజు మారు రథయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 3.45 గంటల నుంచి 6 గంటల మధ్య గుండిచా మందిరంలో ఉన్న స్వామి వారిని రథం పైకి ఎక్కిస్తారు. సాయంత్రం 6 గంటలకు అక్కడి నుంచి స్వామి వారు రథంపై బయలుదేరుతారని అర్చకుడు లింగరాజ్‌ రథో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు.

పార్వతీపురం: ప్రభుత్వం నిర్దేశించిన పనితీరు సూ చికల (కేపీఐ)లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందు కు అన్ని శాఖాధికారులు సమన్వయంతో పనిచేసి ఎ+గ్రేడ్‌ సాధించాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ నెలవారీ, త్రైమాసిక లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని, లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డేటా నమోదులో సమగ్రత, పారదర్శకత పాటించాలని, ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమాచారాన్ని ముందుగా ప్రణాళిక విభాగం పరిశీలించాలని సూచించారు. వ్యవసాయ రుణాలు, ఆరోగ్య సూచీ లు, పోలీసుశాఖ పనితీరు తదితర అంశాలలో పురోగతి సాధించి ఈనెలాఖరులోగా అన్ని శాఖలు లక్ష్యాలు చేరుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఆర్డీఓ కె.మాధురి, సీపీఓ పట్నాయక్‌ పాల్గొన్నారు.

తల్లిదండ్రులు హాజరు కావాలి

మెగా పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌కు శుక్రవారం జిల్లాలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి కోరారు. విద్యార్థుల చదువు, హాజరు, ప్రవర్తన, విద్యాప్రగతిపై ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు చర్చించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement