సీదిరి అరెస్టు ముమ్మాటికి రాజకీయ కక్షే.. | - | Sakshi
Sakshi News home page

సీదిరి అరెస్టు ముమ్మాటికి రాజకీయ కక్షే..

Jul 24 2026 1:15 AM | Updated on Jul 24 2026 1:15 AM

సీదిరి అరెస్టు ముమ్మాటికి రాజకీయ కక్షే.. ● ఎమ్మెల్సీ విక్రాంత్‌, మాజీ ఎమ్మెల్యే కళావతి

● ఎమ్మెల్సీ విక్రాంత్‌, మాజీ ఎమ్మెల్యే కళావతి

పాలకొండ రూరల్‌: రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజల్లో పేరున్న బలహీనవర్గాలకు చెందిన ప్రతిపక్ష నాయకులను వేధించడమే లక్ష్యంగా కూటమి సర్కారు ముందుకు వెళ్తోంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రభుత్వం గుర్తించాల ని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, మాజీ శాసన సభ్యురాలు విశ్వాసరాయి కళావతి అన్నారు. ఉత్తరాంఽధ్రకు చెందిన బీసీ నాయకుడు, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజుకు వైద్యుడుగా, ప్రజాప్రతినిధిగా ఉన్న గౌరవాన్ని ఓర్వలేక తప్పుడు కేసులు బనాయించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ మేరకు గురువా రం వారు స్థానిక మీడియాతో మాట్లాడారు. రో డ్డు ప్రమాదానికి రాజకీయ రంగులు పులమడం, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయ డం హేయమైన చర్యగా పేర్కొన్నారు. తద్వారా సీదిరి సామాజిక వర్గంలో అలజడి సృష్టించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ముందస్తు ప్రణాళికతోనే సీదిరి కుటుంబాన్ని ఇరుకున పెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. తొలినుంచి ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపించడమే ఈ కక్షకు కారణంగా భావించాల్సి వస్తుందన్నారు. ఇప్పటి కై నా ప్రజా వ్యతిరేకతను చవిచూడకుండా ఉండాలంటే రాజకీయ కక్షసాధింపులు, వేధింపులు విరమించుకోవాలని హితవు పలికారు. ఈ తరహా చర్యలకు వైఎస్సార్‌సీపీ నాయకులు వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement