బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
విజయనగరం: పారా బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక ఆదివారం స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపిక పోటీల్లో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.దయానంద్ మాట్లాడుతూ.. వీల్‌చైర్, ఆర్థో కేటగిరీలకు సంబంధించి మెన్, ఉమెన్ విభాగాల్లో పోటీలు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 28 మంది హాజరుకాగా 20 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో మార్చి 6 నుంచి 10 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు తలపడతారని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి.కల్యాణి, జాయింట్ సెక్రటరీ కె. లక్ష్మి, శ్రీకాకుళం ట్రెజరర్ స్రవంతి, కోచ్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


