బిల్లులు ఎందుకు నిలిపివేశారు..? | - | Sakshi
Sakshi News home page

బిల్లులు ఎందుకు నిలిపివేశారు..?

Feb 23 2026 9:39 AM | Updated on Feb 23 2026 9:39 AM

బిల్లులు ఎందుకు నిలిపివేశారు..?

బిల్లులు ఎందుకు నిలిపివేశారు..?

బిల్లులు ఎందుకు నిలిపివేశారు..?

అధికారులను నిలదీసిన ఎ. రావివలస సర్పంచ్‌ శివారెడ్డి

Isîæ MýS…ò³-±Ë$, yólsêòÜ…-rÆŠ‡ õ³Çr ˘

భూ సేకరణ చేపడితే ఊరుకోం..

పూసపాటిరేగ: అమటాం – రావివలస రహదారి పనులకు సంబంధించి బిల్లులను ఎందుకు నిలిపివేశారని ఎ.రావివలస సర్పంచ్‌ ఉప్పాడ శివారెడ్డి అధికారులను నిలదీశారు. పనులు పూర్తయినా రూ. 13 లక్షలు చెల్లించకపోవడానికి కారణం ఎవరో తేల్చాలని పీఆర్‌ జేఈ గణేష్‌ను నిలదీశారు. ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డి అధ్యక్షతన ఆదివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రహదారి బిల్లు చెల్లించకుండా రాజకీయం చేయడంపై సభ్యులు ప్రశ్నించడంతో జేఈ గణేష్‌ వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి త్వరలోనే బిల్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు కలుగచేసుకొని తక్షణమే బిల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఇప్పటివరకు సుమారు 3 వేల ఎకరాల వరకు భూసేకరణ చేయగా.. తాజగా ఐటీ పార్కు, డేటా సెంటర్‌ ఏర్పాటుకు 9 గ్రామాల్లో బలవంతంపు భూసేకరణ చేపట్టడం దారుణమని సభ్యులు ప్రశ్నించారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులు స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో డీటీ హరి మాట్లాడుతూ.. ఐటీ పార్కులు, డేటా సెంటర్లకు సుమారు 8 వేల ఎకరాల భూమిని గుర్తించాలని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. వెంటనే రాయివలస సర్పంచ్‌ శివారెడ్డి స్పందిస్తూ సెంట్‌ భూమి కూడా ఇచ్చే పరిస్థితి లేదని.. ఇప్పటికే ఎయిర్‌పోర్టు పేరిట వందల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. ఈ బలవంతపు భూ సేకరణపై శాననమండలిలో ప్రశ్నిస్తానని ఎమ్మెల్సీ పెనుమత్స చెప్పారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను విస్మరించి.. గ్రామాలలో వెండర్‌ పేరిట పనులు చేస్తున్న అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలకడం మానుకోవాలని ఎంపీపీ అనూషారెడ్డి అధికారులకు సూచించారు. అనంతరం పలు సమస్యలపై సభ్యులు అధికారులను నిలదీశౠరు. కార్యక్రమంలోఎంపీడీఓ డీడీ స్వరూపారాణి, వైస్‌ ఎంపీపీ రావాడబాబు, ఎంఈఓ రమణమూర్తి, సర్పంచ్‌లు గరే మురళి, అప్పరభుక్త పైడినాయుడు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement