అనధికార మద్యం దుకాణాలపై దాడి | - | Sakshi
Sakshi News home page

అనధికార మద్యం దుకాణాలపై దాడి

May 12 2025 12:35 AM | Updated on May 14 2025 3:44 PM

10 మద్యం బాటిల్స్‌తో వ్యక్తి అరెస్టు

పూసపాటిరేగ: మండలంలోని చోడమ్మ అగ్రహారంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న బెల్టుషాపులపై భోగాపురం ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.రవికుమార్‌ ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దాడుల్లో చోడమ్మ అగ్రహారానికి చెందిన వ్యక్తి పట్టుబడడంతో 10 మద్యం బాటిల్స్‌తో అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరూ అనధికారికంగా మద్యం దుకాణాలు (బెల్ట్‌ షాపులు) నిర్వహించరాదని, ప్రోత్సహించరాదని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఎస్సై చంద్రమోహన్‌ హెచ్‌సీ రామారావు, కానిస్టేబుల్‌ మహేష్‌లు పాల్గొన్నారు.

ఎండవేడికి కాలిపోయిన ట్రాక్టర్‌ ఇంజిన్‌

శృంగవరపుకోట: మండలంలోని పోతనాపల్లి పంచాయతీ పరిధి ఎరుకులపేట హోలీ స్పిరిట్‌ పాఠశాల సమీపంలో గల ఇటుకల బట్టీ వద్ద ఉంచిన ట్రాక్టర్‌ ఇంజిన్‌లో ఎండవేడికి ఒక్కసారిగా మంటలు వచ్చి ఆదివారం కాలిపోయింది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పొట్నూరు శివ తన ట్రాక్టర్‌ను ఇటుకల బట్టీ వద్ద ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉంచి పక్కనే సేదతీరాడు. అంతలోనే ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ మంటలను ఆదుపు చేయడానికి స్థానికులు సాహసించినా నిలువరించ లేకపోయారు. దీంతో ఎస్‌.కోట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అప్పటికే ట్రాక్టర్‌ పూర్తిగా కాలిపోయిందని శివ తెలిపాడు.

బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

కొత్తవలస: కొత్తవలస–దేవరాపల్లి రోడ్డులో దేవాడ జంక్షన్‌ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో లక్కవరపుకోట మండలం కోనమసివానిపాలెం గ్రామానికి చెందిన గాడి తాత (63) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాడి తాత దేవాడ జంక్షన్‌ నుంచి నడుచుకుంటూ వస్తుండగా తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై వేగంగా వచ్చి వెనుకనుంచి వచ్చి తాతాను ఢీకొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన తాతను స్థానికుల సహాయంతో 108 వాహనంలో విశాఖపట్నం తరలించే క్రమంలో పెందుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించగా అప్రటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా మృతుడుకి భార్య సన్యాసమ్మతో పాటూ ఒక కూతురు ఉంది. ఫిర్యాదు మేరకు కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .

లారీ ఢీకొని యువకుడు..

బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామ పెట్రోల్‌ బంకు సమీపంలో జాతీయ రహదారి26పై లారీ ఢీకొనగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్సై యు.మహేష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలం, మక్కువ గ్రామంలోని శ్రీదేవి కాలనీకి చెందిన యువకుడు తుమరాడ జానకీరాం (22) ద్విచక్రవాహనంపై విశాఖపట్నం నుంచి స్వగ్రామం ఆదివారం వస్తుండగా విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో జానకీ రాం అక్కడిక్కడే మృతిచెందాడు. మృతేదేహాన్ని పంచనామా నిమిత్తం విజయనగరంలోని సర్వజన కేంద్రాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

అనధికార మద్యం దుకాణాలపై దాడి1
1/1

అనధికార మద్యం దుకాణాలపై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement