మాట్లాడుతున్న ట్రిబ్యునల్ జడ్జి ఉంగట్ల సత్యారావు
● న్యాయమూర్తి ఉంగట్ల సత్యారావు
బొబ్బిలి: సామాన్యులకు న్యాయం అందేలా న్యాయవాదులు కృషి చేయాలని, న్యాయవ్యవస్థపై అందరికీ నమ్మకం కలిగేలా న్యాయవాదులంతా పని చేయాలని విశాఖ భూసేకరణ, రీహేబిటేషన్ ప్రిసైడింగ్ అధికారి, ట్రిబ్యునల్ జడ్జి ఉంగట్ల సత్యారావు సూచించారు. స్థానిక ఎన్జీఓ హోంలో భారత న్యాయవాదుల సంఘం జిల్లా సభలు స్థానిక న్యాయవాది కండాపు ప్రసాదరావు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన న్యాయమూర్తి సత్యారావు మాట్లా డుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయవాదులు తమ వాదనా పటిమకు పదును పెట్టాలని, న్యాయవ్యవస్థ, ప్రజలు, మారుతున్న సమాజంపై పట్టు సాధించాలని సూచించారు. సుప్రీంకోర్టు పలు చట్టాలను మార్చాలని సూచించినా పార్లమెంట్ తిరస్కరించిందని, మార్పు అనివార్యమైనా మార్పు రాలేదన్నారు. న్యాయవాదులు కోర్టుల విలువైన సమయాన్ని, కక్షిదారుల సహనం పరీక్షించరాదన్నారు. 550 జిల్లాలలో విస్తరించిన భారత న్యాయవాదుల సంఘం పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. ఐఏఎల్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు కెఎస్.సురేష్‌కుమార్, సభ్యులు భగవతమ్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా నుంచి పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు హాజరయ్యారు. పలువురు న్యాయవాదులు తమ అనుభవాలను పంచుకున్నారు.


