రిగ్గింగ్‌ చేసేద్దాం! | - | Sakshi
Sakshi News home page

రిగ్గింగ్‌ చేసేద్దాం!

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

బహిరంగంగానే కూటమి ఏర్పాట్లు దొంగ ఓట్లు వేయడానికి ఎత్తుగడలు గొడవలు సృష్టించడానికి ప్రణాళిక విచ్చలవిడిగా నగదు పంపిణీ వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లకు బెదిరింపులు

ఏజెంట్లకు రక్షణ కల్పించాలి

వందల మంది గుర్తు తెలియని వ్యక్తులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కూటమి బలంగా ఉన్న గ్రామాల్లో రిగ్గింగ్‌లు చేద్దాం.. వైఎస్సార్‌ సీపీ బలంగా ఉన్న గ్రామాల్లో గొడవలు సృష్టిద్దాం.. జెడ్పీటీసీ ఎన్నికల్లో అడ్డదారులు తొకై ్కనా సరే గెలిచేందుకు కూటమి నేతలు ఇలా కుట్రలు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా దాచేపల్లి, గురజాల, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. కూటమి నేతలకు ధీటుగా బలమైన అభ్యర్థులు వైఎస్సార్‌ సీపీ తరఫున బరిలో నిలవడంతో కూటమి అభ్యర్థులకు గెలుపుపై నమ్మకం లేకుండా పోయింది.

పోలీసుల మద్దతుతో...

జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి నేతలు రిగ్గింగ్‌లకు పాల్పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికారం ఉండటం.. మరోవైపు పోలీసుల మద్దతు సంపూర్ణంగా ఉండటంతో రిగ్గింగ్‌లు చేసేందుకు కూటమి నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక చోట్ల కూటమి నేతలు రిగ్గింగ్‌లకు పాల్పడ్డారు. అదే పంథాను ఇక్కడ కూడా కొనసాగించేందుకు కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. దాచేపల్లి, గురజాల, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లో కూటమి బలంగా ఉన్న గ్రామాల్లో పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించి రిగ్గింగ్‌లు చేసేందుకు పావులు కదుపుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఎదురు తిరిగితే వారిని బలవంతంగా బయటకు పంపించేలా వ్యూహాలు రచిస్తున్నారు.

అడ్డదారుల్లో మద్దతు

జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి అభ్యర్థులకు అడ్డదారుల్లో ప్రభుత్వ అధికారుల నుంచి మద్దతు లభిస్తోంది. పోలీసులతో పాటుగా ప్రధాన శాఖల అధికారులు పూర్తిస్థాయిలో కూటమి అభ్యర్థులకు అండగా నిలిచారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసినప్పటి నుంచి ప్రచార కార్యక్రమాల వరకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఎన్నికల రోజున ఏం జరిగినా కూటమి అభ్యర్థులకు అండగా ఉండేలా పనిచేస్తున్నారు. కొంతమంది డ్వాక్రా యానిమేటర్లు ఎన్నికల ప్రచారం కూడా చేసి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఎన్నికల సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు వందల సంఖ్యలో వచ్చారు. వీరంతా నామినేషన్ల కేంద్రాల వద్ద హల్‌చల్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ తరఫున నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిపై వీరే దాడులకు తెగబడ్డారు. తాజాగా జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇతర ప్రాంతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. పరిస్థితులు కూటమికి అనుకూలంగా ఉంటే ఒకలా వ్యవహరించేలా.. అనుకూలంగా లేకపోతే దాడులు చేసేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులకు ప్రజల నుంచి సానుభూతి లభించడంతో కూటమి నేతలకు ఓటమి భయం పట్టుకుంది. దీంతో ఎన్నికల్లో గెలిచేందుకు కూటమి నేతలు ఓటర్లకు తాయిలాలు ఎర చూపుతున్నారు. ఓటుకు నోటుతో లెక్క సరి చేస్తున్నారు. మద్యం కూడా విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు.

జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌ సీపీ తరఫున పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లుగా ఉండేవారికి పోలీసులు రక్షణ కల్పించాలి. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు రక్షణ కల్పించి అండగా ఉండాలి. కూటమి నేతల బెదిరింపులతో ఎన్నికలు పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి.

– మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి,

జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, దాచేపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement