భారీగా పంట నష్టం.. రైతుల ఆవేదన | - | Sakshi
Sakshi News home page

భారీగా పంట నష్టం.. రైతుల ఆవేదన

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

నరసరావుపేట రూరల్‌: నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండలో భారీ వర్షపాతం నమోదు అయింది. నరసరావుపేటలో విద్యుత్‌ నిలిపివేయడంతో రోజంతా అంధకారం నెలకొంది. ప్రకాష్‌నగర్‌లో వేప చెట్టు నేలకొరిగి కారుపై పడింది. వరి, పత్తితో పాటు కూరగాయలు, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. వరి పంట నేలకొరిగింది. పత్తి పంటలో పూత, కాయ నేలరాలాయి. జిల్లాలో 3,268 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. చిలకలూరిపేట, యడ్లపాడు, నకరికల్లు, రొంపిచర్ల, రాజుపాలెం మండలాల్లోని 4,824 మంది రైతులకు నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు తెలిపారు. జిల్లాలోని 556 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశామని జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు తెలిపారు. 570 మందికి రైతులకు చెందిన రూ.6.64 కోట్లు విలువైన పంటలకు నష్టం జరిగినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement