వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి ఇంటిపై దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి ఇంటిపై దాడి

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

మాచర్ల: మాచర్ల పట్టణంలోని 28వ వార్డు నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొడ్డు చిన నరసింహారావు ఇంటిపై టీడీపీ గూండాలు మంగళవారం దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నరసింహారావు నామినేషన్‌ దాఖలు చేసి బీ ఫారం ఇవ్వటానికి వెళ్లిన సమయంలో తెలుగుదేశం నాయకులు పురపాలక సంఘ కార్యాలయంలో అడ్డగించి దాడి చేశారు. బీ ఫారం చించివేశారు. అయినా ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశారు. వార్డులో ప్రచారం చేసి ప్రజలను ఆకర్షించారు. మంగళవారం కౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఫలితాలు వచ్చిన వెంటనే మహిళలతోపాటు పలువురు నరసింహారావు ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి చేసి రభస చేశారు. ఆయన కుటుంబ సభ్యులను బెదిరిస్తూ బీభత్సం సృష్టించారు. దాడి జరుగుతున్నా పోలీసులు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. ఈ విషయాన్ని కొంత మంది చిత్రీకరించడంతో దాడి విషయం బహిర్గతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement