మూడు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

మూడు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

మూడు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు వెబ్‌సైట్‌ ద్వారా ఓటు వివరాలు ప్రత్యక్షం సత్తెనపల్లి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉందో రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కృతిక శుక్లా ప్రకటించారు. ఓటర్లు తమ పోలింగ్‌ కేంద్రం వివరాలను ముందుగానే పరిశీలించుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని, ఓటర్ల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకొని ఓటర్లు తమ పోలింగ్‌ కేంద్రం వివరాలను సులభంగా తెలుసుకోవాలని సూచించారు.

నరసరావుపేట: ఆర్నాబ్‌ తుపాను కారణంగా ఏపీ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీసీపీడీసీఎల్‌) చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.పుల్లారెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ నల్లూరి మస్తాన్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మూడు కంట్రోల్‌ రూమ్‌లను ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు పనిచేస్తాయని తెలిపారు. అవి 24 గంటలూ విద్యుత్‌ వాడకందారులకు అందుబాటులో ఉండే విధంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. తుపాను సమయంలో విద్యుత్‌ భద్రత సూచనలు పాటించాలని, విద్యుత్‌ అంతరాయం కలిగిన సమయంలో సమాచారం కోసం కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 76610 19447, నరసరావుపేట డివిజన్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 94408 17539, మాచర్ల డివిజన్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 94408 17531 సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement