నూజెండ్ల: ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొని డీసీఎం డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగింది. శుక్రవారం మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నూజెండ్ల గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి క్రిష్ణారెడ్డి(52) డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు గురువారం ఏపీలోని దర్శి నుంచి హైదరాబాద్‌కు డీసీఎంలో కరివేపాకు లోడుతో బయల్దేరాడు. మార్గమధ్యలో గురువారం రాత్రి మిర్యాలగూడ మండలం కిష్టాపురం వద్ద గల భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు డీసీఎం రహదారి ఎడమ వైపునకు బోల్తాపడింది. క్రిష్ణారెడ్డి డీసీఎంలోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని డీసీఎం నుంచి బయటకు తీసి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.
గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొని డీసీఎం డ్రైవర్ మృతి
Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM
గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొని డీసీఎం డ్రైవర్ మృతి నకిలీ ఫోన్‌పేతో రెండు బస్తాల బియ్యం అపహరణ గోళ్లపాడు(ముప్పాళ్ల): నకిలీ ఫోన్ పే చూపించి రెండు బస్తాల బియ్యం ఎత్తుకెళ్లిన సంఘటన మండలంలోని గోళ్లపాడు గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. సంఘటనకు సంబంధించి బాధితుడు కామినేని శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని ప్రధాన కూడలిలో శ్రీనివాసరావు కూల్‌డ్రింక్స్ దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు. సోదరుడి ఆరోగ్యం బాగా లేకపోవడంతో సత్తెనపల్లి మండలం భీమవరం గ్రామానికి వెళ్లాడు. దుకాణంలో శ్రీనివాసరావు భార్య ఉండగా నరసరావుపేట వైపు నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన యువకుడు రెండు బియ్యం బస్తాలు కావాలని అడిగాడు. రూ.3,500 నగదును ఫోన్ పే చేస్తానని చెప్పగా, స్కానర్‌కి చేయమని చెప్పింది. యువకుడు ఫోన్ నెంబర్‌కే చేస్తానని చెప్పి శ్రీనివాసరావు నెంబర్‌కు ఫోన్ పే చేసినట్లుగా స్క్రీన్‌షాట్ చూపించి రెండు బియ్యం బస్తాలు తీసుకొని సత్తెనపల్లి వైపు వెళ్లిపోయాడు. భర్త ఇంటికి రాగా విషయం చెప్పడంతో ఎలాంటి నగదు రాలేదని చెప్పడంతో మోసపోయమని గ్రహించి జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించాడు.
Advertisement


