ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన పోలీసులు

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన పోలీసులు

బొల్లాపల్లి:ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడుని సకాలంలో స్పందించిన పోలీసులు కాపాడి వైద్యశాలకు తరలించిన సంఘటన మండలంలోని మాలపాడు గ్రామ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన వంకాయలపాటి శ్రీను పనిచేయడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురై కూల్‌ డ్రింక్‌ బాటిల్‌తోపాటు ఎలుకల మందు పేస్టు తీసుకొని అడవిలోకి వెళ్లాడు. తాను చనిపోతున్నానని వాట్సప్‌, ఇన్‌ స్ట్రాగామ్‌ స్టేటస్‌లో పెట్టడంతోపాటు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సమీప ప్రాంతాల్లో గాలించారు. జాడలేక కనుగొనలేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన బండ్ల మోటు ఎస్‌ఐ సయ్యద్‌ షమీర్‌బాషా, సిబ్బంది సహాయంతో గాలింపు చేపట్టారు. యువకుడి ఫోన్‌ నెంబర్‌ లొకేషన్‌ గుర్తించారు. అటవీ ప్రాంతంలో గుబురుగా, పొదల చెట్ల మధ్య అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే ఆ యువకుడిని బొల్లాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సకాలంలో వైద్య సేవలు అందడటంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై సకాలంలో స్పందించిన ఎస్‌ఐ, సిబ్బందికి మాలపాడు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement