సమగ్రశిక్ష ఏపీసీ వి.పద్మావతి
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్ల ద్వారా పంపిణీ చేసిన పుస్తకాల బ్యాగుల నాణ్యతపై ‘‘సాక్షి’’లో శుక్రవారం ప్రచురించిన ఫొటో ఫీచర్‌కు స్పందన లభించింది. నాసిరకం బ్యాగులు చిరిగిపోవడంతో విద్యార్థులు పడుతున్న అవస్థలను వివరిస్తూ ఫొటో ఫీచర్ ప్రచురితమైంది. సమగ్రశిక్ష ఏపీసీ వి.పద్మావతి దీనిపై మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 89,187 మంది విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశామని శనివారం తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు లేని బ్యాగులను వెనక్కు తీసుకుంటామని పేర్కొన్నారు.


