శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పీవీ రాజీవ్
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు పారా లీగల్ వలంటీర్లకు గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.ఆర్.రాజీవ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.వి.రాజీవ్ పారా లీగల్ వలంటీర్ల ముఖ్యమైన బాధ్యతల గురించి వివరించారు. వాటిలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం అంశంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానంగా మధ్యవర్తిత్వం, సంధానం, రాజీ విధానం ద్వారా న్యాయ పరంగా కేసుల పరిష్కారానికి ఉపయోగపడుతుందని తెలిపారు. సమాజంలో పారా లీగల్ వలంటీర్ల పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు. న్యాయ సహాయం అవసరమైన వారిని గుర్తించి వారికి తగు సలహాలు, సూచనలు ఇచ్చి, చట్ట పరమైన సేవల గురించి కూడా అవగాహన కల్పించే బాధ్యత ఉందని తెలిపారు. చిన్న చిన్న ఉదాహరణలతో వలంటీర్లకు అర్ధమయ్యే రీతిలో సివిల్, క్రిమినల్ కేసులను ఎలా పరిష్కరించాలో వివరించారు. ప్యానెల్ అడ్వకేట్ కె.కాళిదాసు, సీనియర్ పారా లీగల్ వలంటీర్ షేక్ మొహమ్మద్ రఫీ మాట్లాడారు.
సమన్వయంతోనే వినూత్న ఆవిష్కరణలు
చేబ్రోలు: భవిష్యత్‌లో పరిశోధనలు ఇంటర్ డిసిప్లినరీ విధానంలో మరింత విస్తరించనున్నాయని, గణితం, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, జీవశాస్త్రం, వైద్యశాస్త్రం వంటి విభిన్న రంగాల సమన్వయంతో వినూత్న ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ ఎస్.బాలకృష్ణ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్ (ఐసీసీఎంఎస్‌ఎస్–2026)’ అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. హైబ్రిడ్ విధానంలో (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముందుగా సదస్సుకు సంబంధించిన కాన్ఫరెన్స్ సావనీర్‌ను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఎస్.బాలకృష్ణ మాట్లాడుతూ అనువర్తిత గణితం, కంప్యూటేషనల్ సైన్సెస్ రంగాలు నేటి సాంకేతిక ప్రపంచానికి వెన్నెముకగా నిలుస్తున్నాయన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, హై–పర్‌ఫార్మెన్స్ కంప్యూటింగ్, శాసీ్త్రయ అనుకరణలు వంటి రంగాల్లో వేగంగా జరుగుతున్న పరిశోధనలను వివరించారు. ఐఐటీ పాట్నా ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ మాట్లాడుతూ సంక్లిష్టమైన శాసీ్త్రయ సమస్యలను విశ్లేషించడంలో, వాటికి ఖచ్చితమైన పరిష్కారాలను రూపొందించడంలో అధునాతన గణిత భావనలు కీలకంగా మారాయని తెలిపారు.


