పేటలో చీకటి వేట | - | Sakshi
Sakshi News home page

పేటలో చీకటి వేట

Feb 25 2026 9:39 AM | Updated on Feb 25 2026 9:39 AM

పేటలో చీకటి వేట

పేటలో చీకటి వేట

ఇంకెన్నాళ్లీ అంధకారం..!

రెండు దశాబ్దాలుగా వేకువవేళ చిమ్మచీకట్లో నరసరావుపేట ప్రతి రోజూ తెల్లవారుజామున అరగంటపాటు విద్యుత్‌ కోత ఉదయాన్నే అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు రంజాన్‌ మాసంలో ప్రార్థన మందిరాలకు వెళ్లేందుకు అవస్థలు ప్రభుత్వం మాటల్లోనే 24 గంటలపాటు విద్యుత్‌

ఇబ్బందులు పడుతున్న ప్రజలు..

కలెక్టర్‌ దృష్టి సారిస్తేనే..

సుమారు రెండు దశాబ్దాలుగా వేకువజామున కరెంటు కోత నరసరావుపేట నుదుట నల్లని తిలకం దిద్దుతోంది. శుభోదయాన చిరునవ్వులతో అందరికీ రోజు ప్రారంభమైతే నరసరావుపేట ప్రజలకు చిమ్మ చీకటి ఆహ్వానం పలుకుతోంది. వేకువవేళ ముంగిళ్లలో ముగ్గులు వేయాలన్నా.. మార్నింగ్‌ వాక్‌ కు ముందుకు కదలాలన్నా.. ప్రార్థన మందిరాలకు వెళ్లాలన్నా.. వ్యాపారాలకు తలుపులు తీయాలన్నా అందరినీ చీకటి కమ్మేస్తోంది. 20 ఏళ్ల క్రితం తాగునీటి సరఫరాకు అంతరాయం పేరిట ప్రారంభమైన కోత.. ఇప్పటికీ ప్రజలకు వాత పెడుతూనే ఉంది. ఏళ్లు గడిచినా, విద్యుత్‌ సంస్థలు లాభాలు పట్టినా.. నరసరావుపేటను మాత్రం ఆ అర్ధ గంట విద్యుత్‌ కోతల గ్రహణం పట్టిపీడిస్తోంది.
ఇంకెన్నాళ్లీ అంధకారం..!

నరసరావుపేటటౌన్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేవని ఓ వైపు చంద్రబాబు ప్రభుత్వం.. మరో వైపు ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పుకొస్తున్నప్పటికీనరసరావుపేటలో పరిస్థితి భిన్నంగా ఉంది. 20 ఏళ్లుగా వేకువజామున అర్ధగంటపాటు విద్యుత్‌ కోత అప్రకటితంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాల క్రితం మంచినీటి సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా అప్పట్లో వేకువజామున అర్ధగంటపాటు విద్యుత్‌ కోతలు విధించేలా అధికారులు నిర్ణయించారు. మంచినీటి సమస్య పరిష్కారమైనా విద్యుత్‌ కోతలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. నరసరావుపేట పట్టణా న్ని శుభోదయాన అంధకారంలోకి నెట్టివేస్తున్నాయి. ఎలాగో ప్రతి రెండో శనివారం విద్యుత్‌ మెయింటెనెన్స్‌ పేరిట ఒక పూట విద్యుత్‌ కోత లు కొనసాగిస్తున్నారు. నిరుపేదలు ఒక రోజు విద్యుత్‌ బిల్లు చెల్లింపులో కొంచెం ఆలస్యమైతే జరిమానాలతోపాటు మీటరు లాక్కెళ్లే అధికా రులు.. రెండు దశాబ్దాలుగా విద్యుత్‌ కోతలు అప్రకటితంగా కొనసాగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

ఇదీ విద్యుత్‌ కోత కథ ...

నరసరావుపేట పట్టణంలో ప్రతి రోజు తెల్లవారుజామున 5.30 నుంచి 6 గంటల వరకు గత కొన్నేళ్లుగా విద్యుత్‌ సరఫరా నిలిపి వేస్తున్నారు. మంచినీటి సరఫరా అందరికీ అందాలన్నా ఉద్దేశంతో మొదట్లో విద్యుత్‌ నిలుపుదల చేపట్టారు. మొదటి రైల్వే గేటు సమీపంలోని మున్సిపల్‌ గెస్ట్‌హౌస్‌ ప్రాంగణంలో ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నుంచి గతంలో పట్టణం మొత్తం నీటి సరఫరా అయ్యేది. మున్సిపల్‌ శాఖ ప్రతి రోజూ ఉదయం 5 నుంచి 6 గంటల వరకు నీటి సరఫరా చేస్తోంది. మోటార్లు వినియోగించటం వల్ల శివారు ప్రాంతాలకు నీరు అందటం లేదని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అప్పట్లో అరగంటపాటు పవర్‌ కట్‌ చేయాలని నిర్ణయించారు. కాలక్రమేణా పట్టణ పరిధిలో ప్రస్తుతం 6 ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ల ద్వారా నీరు సరఫరా అవుతుంది. అన్ని ప్రాంతాలకు నీరు సంతృప్తకర స్థాయిలో అందుతుండటంతో మోటార్ల భయం లేదు. తాగునీటి కష్టాలు తీరినప్పటికీ కరెంట్‌ కోతల వెతలు తీరలేదు. ప్రార్థనలకు ఆటంకం..

పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు ప్రార్థన మందిరాలకు వెళ్లి ఐదు పూటల క్రమం తప్పకుండా నమాజ్‌లో పాల్గొంటారు. తెల్లవారుజామున ఉపవాస దీక్షల ప్రారంభం అనంతరం తప్పనిసరిగా మసీద్‌కు వెళ్లి నమాజ్‌లో పాల్గొంటారు. ప్రస్తుతం ప్రార్థనలు చేయటానికి వెళ్లే ముస్లింలు చిమ్మచీకటిలో రాకపోకలు సాగిస్తున్నారు.

అప్రకటిత విద్యుత్‌ కోతపై పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సమస్యను సాంకేతికంగావిశ్లేషించి శాశ్వత పరిష్కారం చూపించాల్సి ఉంది.

ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లే మహిళలు, వృద్ధులు చీకట్లో బయలు దేరాల్సి వస్తుంది. వీధిలైట్లు సైతం నిలిపివేయడంతో రోడ్లపై సరైన వెలుతురు లేక చిన్న పాటి ప్రమాదాలు ఇప్పటికే అనేకం చోటుచేసుకున్నాయి. ఇటీవల బరంపేటలో ఇంటి ఎదుట తెల్లవారుజామున ముగ్గు వేస్తున్న మహిళ మెడలో ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు ఇద్దరు చైన్‌న్‌ లాక్కొని పరారీ అయ్యారు. సమీపంలో సీసీ పుటేజ్‌ ఉన్నా పవర్‌ కట్‌ కారణంగా ప్రయోజనం లేకుండా పోయింది. విద్యుత్‌ కోతలతో నిద్రకు భంగం వాటిల్లుతోందని పలువురు వాపోతున్నారు. కొంత మంది అర్థిక భారమైనా ఇన్వర్టర్‌లు ఏర్పాటు చేసుకున్నారు. స్థోమత లేని పేదలు కరెంట్‌ కష్టాలను అనుభవిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement