● మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ● జూలకల్లులో ఇప్పటికి ఐదుగురిపై దాడి ● వడ్డీతో సహా తిరిగి ఇచ్చే రోజు వస్తుంది | - | Sakshi
Sakshi News home page

● మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ● జూలకల్లులో ఇప్పటికి ఐదుగురిపై దాడి ● వడ్డీతో సహా తిరిగి ఇచ్చే రోజు వస్తుంది

Feb 25 2026 9:39 AM | Updated on Feb 25 2026 9:39 AM

 ● మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి  ● జూలకల్లులో ఇప్పట

● మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ● జూలకల్లులో ఇప్పట

● మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ● జూలకల్లులో ఇప్పటికి ఐదుగురిపై దాడి ● వడ్డీతో సహా తిరిగి ఇచ్చే రోజు వస్తుంది

పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి పట్టణంలోని పల్నాడు హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న బీరవల్లి రామిరెడ్డిని ఆయన పరామర్శించారు. మహేష్‌రెడ్డి మాట్లాడుతూ పాపం పండే రోజు త్వరలోనే వస్తుందన్నారు. జూలకల్లు గ్రామంలో ఇప్పటికే ఆరుగురిపై విచక్షణా రహితంగా దాడి చేశారని, ఏ కారణం లేకపోయినా కేవలం బెదిరించటానికి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు గుర్తు పెట్టుకోవాలని, ఇంకా మూడేళ్లు మాత్రమే ఉంటుందని, మూడేళ్ల తర్వాత పాకిస్తాన్‌ వెళ్తారా, ఆప్ఘనిస్తాన్‌కు వెళ్తారా, భారతదేశంలోనే కదా ఉండేది, ఇంతకంతకు అనుభవించే రోజులు వస్తాయని, చట్టపరంగా శిక్షలు పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. కావాలని కాపు కాచి కొడుతున్నారని, పోలీసుల అండ చూసుకొని, ప్రభుత్వం మారిన రోజున ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, దీనికి రెట్టింపు పునరావృతం అవుతాయని, ఆ రోజు మీకే తెలుస్తుందని పేర్కొ న్నారు. అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గూండాయిజం చేస్తున్నారని అన్నారు.వైఎస్సార్‌ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు మాదాల కిరణ్‌కుమార్‌, చింతా సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ అలుప పిచ్చిరెడ్డి, జూలకల్లు సర్పంచ్‌ లంజపల్లి అంకారావు, ఎంపీటీసీ రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement