సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణలో భాగంగా మంగళవారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పల్నాడుజిల్లా పరిధిలోని 49 పరీక్ష కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ కోర్సుల పరీక్షకు 17,044 మంది విద్యార్థులకుగాను 16,402 మంది హాజరయ్యారు. మరో 642 మంది గైర్హాజరయ్యారు. వీరిలో 16,087 మంది జనరల్ విద్యార్థులకుగాను 15,522 మంది, 957 మంది ఒకేషనల్ విద్యార్థులకుగాను 880 మంది హాజరయ్యారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు మూడు సిట్టింగ్, మూడు ఫ్‌లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి పర్యవేక్షణలో ఆయా బృందాలు జిల్లాలోని పలు కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.
సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం


