కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో చోట
తెనాలిటౌన్: కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కిందని ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తెలిపారు.
శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గతంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులలో స్థానం సంపాదించినట్లు చెప్పారు. ఈ పరంపరలో భాగంగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. మున్ముందు ఇలాంటి రికార్డులు మరెన్నో సాధించి ఆర్ట్ గ్యాలరీ శిల్పకళ ద్వారా ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకువస్తామని ఇరువురు తెలియజేశారు.


