రియల్‌కు ముప్పు
న్యూస్‌రీల్
ప్రచారంతో రియల్ ఎస్టేట్ దివాళా
కూటమి నేతలు అత్యుత్సాహంతో చేస్తున్న ప్రకటనలు రియల్ ఎస్టేట్ రంగం కొంప ముంచుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం చెప్పేవన్నీ అమలు జరగడం సంగతి అటు ఉంచి, ఇప్పుడు ఎకరం భూమి ధర కోట్ల రూపాయలకు చేరడం, చదరపు గజం రూ.లక్షలు పలకడంతో అయోమయం నెలకొంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం వచ్చే రెండు, మూడేళ్లలో పూర్తవుతుందని, దానికి ప్రధాన కనెక్టెవిటీగా ఉన్న మచిలీపట్నం – విజయవాడ హైవేను ఆరు లైన్లుగా విస్తరిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పోర్టు పూర్తయితే ఎంత ట్రాఫిక్ పెరుగుతుంది, దానికి ఎన్ని లైన్ల రోడ్డు కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించాలనే అంశాలపై స్పష్టత లేదు. అయినా ఆరు లైన్లుగా విస్తరిస్తారనే ప్రచారంతో ఆ ప్రాంతాల్లో భూముల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కానూరు, పెనుమలూరు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో కొద్దో గొప్పో జరిగే లావాదేవీలు కూడా భారీగా రేట్లు కారణంగా తగ్గిపోయాయి. ఎన్నికలకు ముందు గజం రూ.25 వేలు కాగా, ఇప్పుడు రూ.50 వేలకు పెరిగింది. ఈడుపుగల్లు, గోసాల, వణుకూరు వంటి ప్రాంతాల్లో గతంలో గజం రూ.10 వేలు కాగా, ప్రస్తుతం రూ.30 వేలకు పెరిగిపోయింది. దీంతో సామాన్యులు అటు వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండాపోయింది. ఉయ్యూరు, పామర్రు, నిమ్మకూరు తదితర ప్రాంతాల్లో రహదారి వెంబడి వెంచర్లు మొదలుపెట్టిన రియల్టర్లు కూడా ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ హడావుడితో ముందుకు వెళ్లలేక ఆగిపోయారు.
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
నిత్యాన్నదాన పథకానికి విరాళం
ఆరుద్ర నక్షత్ర వేడుకలు
విపరీతంగా పెరిగిపోయిన భూముల రేట్లు
హైవేల విస్తరణ పేరుతో హంగామా..
రైతుల్లో ఆందోళన
ప్రతిపాదనలు లేకుండానే హడావుడితో రియల్ వ్యాపారం కుదేలు
విజయవాడ – మచిలీపట్నం హైవేను 6 లైన్లకు విస్తరిస్తామని ప్రచారం
చినకాకాని సర్వీస్ రోడ్డు విస్తరణ హడావుడితో నిండా మునిగిన రియల్టర్లు
పల్నాడు
సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2025
గొప్పల డప్పు..
కొత్త ప్రాజెక్టులు రాకుండానే వచ్చేసినట్లు ప్రభుత్వ హడావుడి
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 33,110 క్యూసెక్కులొచ్చి చేరుతోంది. దిగువకు 17వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 45.7183 టీఎంసీలు.
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి యలవర్తి శశిధర్ రూ.1,01,116 విరాళం అందజేశారు.
చేబ్రోలు: నాగేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం ఆరుద్ర నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకారం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు.
రియల్‌కు ముప్పు
రియల్‌కు ముప్పు
రియల్‌కు ముప్పు
రియల్‌కు ముప్పు
రియల్‌కు ముప్పు
రియల్‌కు ముప్పు


