విద్యార్థులను ప్రోత్సహించేందుకే బాలోత్సవ్
● ఘనంగా ముగిసిన వీవీఐటీయూ
బాలోత్సవ్– 2025
● విజేతలకు ప్రశంసాపత్రాలు,
బహుమతులు అందజేసిన అతిథులు
పెదకాకాని: చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించేందుకే బాలోత్సవ్ వేడుకలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీయూలో మూడు రోజులపాటు వైభవంగా జరిగిన బాలోత్సవ్ 2025 వేడుకలు చిన్నారుల తీపి గుర్తులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధురానుభూతుల మధ్య ఘనంగా ముగిశాయి. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా వందల పాఠశాలల నుంచి వేల మంది తరలి వచ్చారు. 25 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. 20 అంశాలు, 61 విభాగాలుగా జరిగిన పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమానాలతోపాటుగా రెండు ప్రత్యేక బహుమతులను విజేతలకు అందించారు. బాలల వికాసంతోపాటు వారికి సంస్కృతి, సంప్రదాయాలను కూడా పరిచయం చేశారు. విద్యార్థుల ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. ఆదివారం విచిత్ర వేషధారణ, శాసీ్త్రయ, జానపద బృంద నృత్యాల నడుమ ప్రాంగణం కోలాహలంగా మారింది. 52 జానపద బృందాలు మూడు వేదికల వద్ద జాతర వాతావరణాన్ని సృష్టించాయి. 36 శాసీ్త్రయ నృత్య బృందాలు 2 వేదికలపై ఉత్సాహంగా ప్రదర్శన చేశాయి. మట్టితో ప్రతిమలు తయారు చేసి ఆకట్టుకున్నారు. వర్సిటీ శాక్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విద్యార్థుల కృషి అభినందనీయమని ప్రో చాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్ అన్నారు. విజేతలకు చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్, వైస్ చాన్సలర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ కె. గిరిబాబు బహుమతులు ప్రదానం చేశారు.
జీవితంలో కళలు భాగం కావాలి
జీవితంలో కళలు భాగం కావాలని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు సృజనాత్మక విషయాలు అలవాటు చేసుకొని ఏదో ఒక రంగంలో రాణించాలన్నారు.
విద్యార్థులను ప్రోత్సహించేందుకే బాలోత్సవ్
విద్యార్థులను ప్రోత్సహించేందుకే బాలోత్సవ్
విద్యార్థులను ప్రోత్సహించేందుకే బాలోత్సవ్
విద్యార్థులను ప్రోత్సహించేందుకే బాలోత్సవ్


